3, జూన్ 2010, గురువారం

మనం రోజు వివిధ రసాయనాలను వాడుతున్నాము. కూరగాయలు, ఆహార ధాన్యాల దిగుబడి కొసమనీ వాడే రసాయనాలు ఒక ఎత్తయుతే పరిశుభ్రత పేరుతొవాడుతున్నరసాయనాలు మరి కొన్ని. ఇవి మెక్కల ద్వారా భూమిలోకి చేరి ఆపైన జంతు జీవాళ్లోకి చేరుతున్నాయు. భుమినీ, వాటిని తిన్న మనకి చేటు చేస్తున్నాయు. ప్రామాదవశాస్తూ వీటిని వాడే వారి శరీరంలో చేరి తీవ్ర నష్టాన్నికలగ చేస్తున్నాయు. అసలు ఈ కృత్రిమ రసాయనాలు రాక ముందు ఏమి వాడేవారంటే సహజంగా పకృతిలో దొరికే వాటిని క్రిమి సంహరకాలుగా, ఎరువులుగా వాడేవారు. ఇప్పుడు అలానే ఖమ్మం జిల్లాలో పుణుకులమనే ఓ గ్రామ ప్రజలు తమ పొలాలకు వెల్లుల్లి రసం, వేప కషాయం, ఆవు పేడ, ఆవు మూత్రం, పచ్చి మిరప రసం లాంటివి వాడి మంచి దిగుబడిని సాధించడమే కాదు, ఆక్కడి మనుషులు ఆరోగ్యంగా ఉన్నారని చెబుతున్నారు. ఇలా ఆ గ్రామం రసాయన పురుగుమందులు వాడని మెదటి గ్రామం అయ్యంది. ఇలా సహజసిద్ధమేనవి వాడి పుణుకుల గ్రామ ప్రజలు అందరికి ఆదర్శంగా నిలిచారు.

2, జూన్ 2010, బుధవారం

తరగని శక్తి

ప్రపంచంలో ప్రతి దేశం ఇంధనావసరాల కోసం అధికంగా ఖర్చు పెడుతున్నారు..పరిమితం ఆయున ఇంధన వనరులను ఇలాగే వాడుతూ పొతే కోన్నాళ్ళకు లోటు ఏర్పడే ఆవకాశం వుంది. బహుముఖ ప్రయెజనాల దృష్ట్యా ఇప్పుడంతా సోలార్ ఎనర్జీ అంటే సౌరశక్తి పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. సూర్య కాంతి మనకు ఉచితంగా లభించే శక్తి. ఎంత వాడుకున్నాతరగదు. ఇంటి ఫై కప్పు మీద 'సోలార్ పానేల్స్' ని అమర్చు కోవాలి స్యురుని నుంచి వచ్చే వేడిని ఈ ప్యానెల్స్ గ్రహించి, ఇంధనంగా మార్చుకుంటాయు. ఈ ఇంధనాన్నిమనకు ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. (సాక్షి)

అవగాహన పెంచుకుంటే చాలావరుకు కాలుష్యాన్ని నియంత్రించవచ్చు

అవగాహన పెంచుకుంటే చాలావరుకు కాలుష్యాన్ని నియంత్రించవచ్చు. మనం తెలుసుకున్న విషయాలను నలుగురుకి  తెలయజేయాలి. చాలా వరకు పర్యావరణం గురంచి అవగాహన లేక ఎన్నో రకాల కాలుష్యాలను సృస్తిస్తున్నాం. మన ఇంటి ముందు శుభ్రంగా వుండాలని పక్క ఇంటి ముందు చెత్త పరేయ్యటం పరిశుభ్రతను పాటించటం ఎలా అవుతుంది  ? విద్య వంతులు చాలా మంది ఈల మన ఇంటి చుట్టూ శుభ్రంగా  వుంటే చాలని అనుకుంటూ వుండే వారున్నారు. వారందిరికి మెత్తం పర్యావరణం గురుంచి చెత్త కుండీ లోనే చెత్త ఎందుకు వేయాలో ఈలాంటి విషయాలన్నీ
తెలయజేయాలి. అవాగాహన పెరిగినప్పుడే సమస్య నుండి బయట పడగలం. (సాక్షి: మదర్ ఎర్త్)

31, డిసెంబర్ 2009, గురువారం

నూతన సంవత్సర శుభాకాంక్షలు


నూతన సంవత్సర శుభాకాంక్షలు

25, డిసెంబర్ 2009, శుక్రవారం

నా మొదటి టపా

ఈ రొజు నా మొదటి టపాని వ్రాస్తున్నాను. నేను రెండు మూడు సంవత్సరాలుగా, చాలా తెలుగు టపాలను చదివాను. నాకు కూడా చాలా రొజుల నుండి టపా వ్రాయాలని వుంది. అందుకే ఈ రొజు శ్రికారం చుడుతున్నాను.