3, జూన్ 2010, గురువారం

మనం రోజు వివిధ రసాయనాలను వాడుతున్నాము. కూరగాయలు, ఆహార ధాన్యాల దిగుబడి కొసమనీ వాడే రసాయనాలు ఒక ఎత్తయుతే పరిశుభ్రత పేరుతొవాడుతున్నరసాయనాలు మరి కొన్ని. ఇవి మెక్కల ద్వారా భూమిలోకి చేరి ఆపైన జంతు జీవాళ్లోకి చేరుతున్నాయు. భుమినీ, వాటిని తిన్న మనకి చేటు చేస్తున్నాయు. ప్రామాదవశాస్తూ వీటిని వాడే వారి శరీరంలో చేరి తీవ్ర నష్టాన్నికలగ చేస్తున్నాయు. అసలు ఈ కృత్రిమ రసాయనాలు రాక ముందు ఏమి వాడేవారంటే సహజంగా పకృతిలో దొరికే వాటిని క్రిమి సంహరకాలుగా, ఎరువులుగా వాడేవారు. ఇప్పుడు అలానే ఖమ్మం జిల్లాలో పుణుకులమనే ఓ గ్రామ ప్రజలు తమ పొలాలకు వెల్లుల్లి రసం, వేప కషాయం, ఆవు పేడ, ఆవు మూత్రం, పచ్చి మిరప రసం లాంటివి వాడి మంచి దిగుబడిని సాధించడమే కాదు, ఆక్కడి మనుషులు ఆరోగ్యంగా ఉన్నారని చెబుతున్నారు. ఇలా ఆ గ్రామం రసాయన పురుగుమందులు వాడని మెదటి గ్రామం అయ్యంది. ఇలా సహజసిద్ధమేనవి వాడి పుణుకుల గ్రామ ప్రజలు అందరికి ఆదర్శంగా నిలిచారు.